హైదరాబాద్, ఆట ప్రతినిధి: వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీసీఏటీ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగే మాస్టర్స్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ ట్రోఫీని నిర్వాహకులు శనివారం ఆవిష్కరించారు. వెటరన్ క్రికెటర్లలోని ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ లీగ్లో 6 జట్లు పాల్గొంటాయని తెలిపారు. సోమవారం నుంచి జూన్ 4 వరకు పోటీలు జరుగుతాయన్నారు.