బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 21, 2020 , 23:32:23

మేరీకోమ్‌.. కరోనా అతిక్రమణ

మేరీకోమ్‌.. కరోనా అతిక్రమణ

  • స్వీయ నిర్బంధం గడువు పూర్తి కాకుండానే రాష్ట్రపతి విందుకు  

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిపై తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్న వేళ.. భారత బాక్సింగ్‌ దిగ్గజం, రాజ్యసభ సభ్యురాలు మేరీకోమ్‌ 14రోజుల తప్పనిసరి నిర్బంధ  నిబంధనను అతిక్రమించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన వారు 14రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సహా ప్రభుత్వాలు సైతం మార్గదర్శకాలు విడుదల చేశాయి. కాగా, జోర్డాన్‌లోని అమన్‌లో జరిగిన ఒలింపిక్‌ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌లో పాల్గొన్న మేరీ ఈనెల 13న స్వదేశానికి తిరిగి వచ్చింది. రెండు వారాల పాటు నిర్భందంలో ఉండాలన్న సూచనలు ఉన్నా పట్టించుకోకుండా... 18వ తేదీన ఎంపీలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన విందుకు మేరీ హాజరైంది. రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్‌ ఖాతా  ద్వారా పోస్ట్‌ చేసిన ఫొటోల్లో ఈ విషయం వెల్లడైంది. కాగా, అంతకుముందు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిన కనిక కపూర్‌ ఇచ్చిన విందుకు హాజరైన ఎంపీ దుష్యంత్‌ చౌతాల సైతం రాష్ట్రపతి భవన్‌ విందుకు వచ్చారు. అయితే, తాను దుష్యంత్‌ను అసలు కలువలేదని, కరచాలనం చేయలేదని మేరీ బదుల్చింది. 


logo