బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 08, 2020 , 00:07:36

క్వార్టర్స్‌లో మేరి, అమిత్‌

క్వార్టర్స్‌లో మేరి, అమిత్‌

అమన్‌(జోర్డాన్‌): ఆసియా ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. దిగ్గజ బాక్సర్‌ మేరీకోం..టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకునేందుకు మరో అడుగుదూరంలో నిలిచింది. శనివారం జరిగిన 51కిలోల బౌట్‌లో మేరి 5-0 తేడాతో టామీ బెన్నీ      (న్యూజిలాండ్‌)పై అలవోక విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఫిలిప్పీన్స్‌ బాక్సర్‌ ఇరిష్‌ మాగ్నోతో తలపడనుంది. అంతకుముందు జరిగిన 52కిలోల బౌట్‌లో పోటీపడ్డ స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ పంగల్‌ 3-2తో ఎన్కామదక్‌ ఖర్కుహుపై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. 


logo