ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 24, 2021 , 15:12:29

బౌండరీ వద్ద ఒంటిచేత్తో క్యాచ్‌..వీడియో వైరల్‌

బౌండరీ వద్ద ఒంటిచేత్తో క్యాచ్‌..వీడియో వైరల్‌

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గప్తిల్‌ సూపర్‌ స్మాష్‌ టోర్నీలో కళ్లుచెదిరే ఫీల్డింగ్‌ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. గప్తిల్‌ ఆక్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  ఈడెన్‌ పార్క్‌లో ఆక్లాండ్‌ ఏసెస్‌, సెంట్రల్‌ డిస్ట్రిక్స్‌ మధ్య మ్యాచ్‌లో ఈ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.  సెంట్రల్‌ డిస్ట్రిక్స్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ జార్జ్‌ వర్కర్‌(11) నాలుగో ఓవర్లో భారీ షాట్‌ ఆడాడు. లాంగాన్‌లో  ఫీల్డింగ్‌ చేస్తున్న గప్తిల్‌ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

VIDEOS

logo