శనివారం 24 అక్టోబర్ 2020
Sports - Sep 23, 2020 , 03:33:30

సీజన్‌ మొత్తానికి మార్ష్‌ దూరం!

సీజన్‌ మొత్తానికి  మార్ష్‌ దూరం!

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరం కానున్నట్టు సమాచారం. బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తున్న సమయంలో మార్ష్‌ కుడి కాలు మడతపడింది. దీంతో అతడి కాలి చీలమండకు తీవ్ర గాయమైంది. వెంటనే మైదానాన్ని వీడిన మార్ష్‌ బ్యాటింగ్‌లోనూ  ఇబ్బందిపడ్డాడు. మార్ష్‌ గాయం తీవ్రమైనదని, ఈ సీజన్‌ మొత్తానికి అతడు అందుబాటులో ఉండడని సన్‌రైజర్స్‌ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అయితే ఈ విషయంపై ఫ్రాంచైజీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే మిడిలార్డర్‌ బలంగా లేని సన్‌రైజర్స్‌కు మార్ష్‌ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బే కానుండగా.. అతడి స్థానంలో ఆసీస్‌ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ డాన్‌ క్రిస్టియన్‌ను తీసుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తున్నది. 


logo