శనివారం 16 జనవరి 2021
Sports - Nov 30, 2020 , 20:52:57

ఓపెనర్‌గా బరిలో దిగేందుకు సిద్ధం : లబుషేన్‌

ఓపెనర్‌గా బరిలో దిగేందుకు సిద్ధం : లబుషేన్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ గజ్జల్లో గాయం కారణంగా భారత్‌తో  ఆఖరిదైన మూడో వన్డే, టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్నర్‌ స్థానంలో ఓపెనర్‌ బరిలోకి దిగడానికి తాను సిద్ధంగా  ఉన్నట్లు మార్నస్‌ లబుషేన్‌ తెలిపాడు. 

'సిరీస్‌ విజయంలో వార్నర్‌ ముఖ్యపాత్ర పోషించాడు. అతన్ని కోల్పోవడం ఇబ్బందిగానే ఉంది. అతనిస్థానంలో మరొక బ్యాట్స్‌మెన్‌ ఓపెనర్‌గా బరిలో దిగి నిలదొక్కుకోవాల్సి ఉంది.   ఓపెనర్‌గా బ్యాటింగ్‌ చేయాలని నన్ను అడిగితే సంతోషంగా బరిలో దిగుతా.  ఐతే దాని కోసం వేచి చూడాలని' లబుషేన్‌ పేర్కొన్నాడు.  భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే కాన్‌బెర్రా వేదికగా బుధవారం జరగనుంది.