శనివారం 16 జనవరి 2021
Sports - Jan 07, 2021 , 13:04:55

ల‌బుషేన్ హాఫ్‌సెంచ‌రీ..భారీ స్కోరు దిశ‌గా ఆసీస్‌

  ల‌బుషేన్ హాఫ్‌సెంచ‌రీ..భారీ స్కోరు దిశ‌గా ఆసీస్‌

సిడ్నీ: భార‌త్‌తో మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా నిల‌క‌డ‌గా ఆడుతోంది.   వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన  మార్న‌స్ లబుషేన్ భార‌త బౌల‌ర్ల‌ను ధాటిగా ఎదుర్కొంటున్నాడు. క్రీజులో కుదురుకున్న ల‌బుషేన్ అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. మ‌రో ఎండ్‌లో స్టీవ్ స్మిత్ స‌హ‌కారం అందిస్తుండ‌టంతో స్కోరు బోర్డును ముందుండి న‌డిపిస్తున్నాడు. 50కి పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పిన ఈ జోడీని విడ‌దీసేందుకు టీమ్ఇండియా బౌల‌ర్లు శ్ర‌మిస్తున్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో 48 ఓవ‌ర్లు ఆడిన ఆసీస్ 2 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. ల‌బుషేన్‌(64), స్మిత్‌(27) క్రీజులో ఉన్నారు. ఇదే జోరు కొన‌సాగించి ఆసీస్‌కు భారీ స్కోరు అందించాల‌ని వీరిద్ద‌రూ క‌సితో బ్యాటింగ్ చేస్తున్నారు.