లీడ్స్: ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ విభాగాన్ని గాయాల బెడద వేధిస్తున్నది. తొలిటెస్టును డ్రా చేసుకుని రెండో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ మార్క్ వుడ్ గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. కుడి చేతి భుజానికి గా యం కావడంతో బుధవారం నుంచి ప్రారం భమయ్యే మూడో టెస్టుకు వుడ్ అందుబా టులో ఉండడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్టు (ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. లార్డ్స్ టెస్టులో భాగంగా నాలుగో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా అతడికి గాయమైంది. ఇప్పటికే ఇంగ్లిష్ జట్టులో గాయాల కారణంగా స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ సిరీస్ నుంచి దూర మవగా ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మానసిక సమస్యల కారణంగా తప్పుకు న్నాడు. తాజాగా వుడ్ కూడా మూడో టెస్టు నుంచి వైదొలగడం ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బగా మారింది.