బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 26, 2020 , 23:30:57

సఫారీ లక్ష్యం 466

సఫారీ లక్ష్యం 466

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఇంగ్లిష్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహ బ్యాటింగ్‌ చేసి ప్రత్యర్థి ముందు 466 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 88/6తో ఆదివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా 183 పరుగులకు ఆలౌటైంది. డికాక్‌ (76) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రూట్‌ (58), సిబ్లే (44), కరన్‌ (35) వేగంగా పరుగులు రాబట్టారు. 


logo