సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 00:20:13

ఫోన్లు బంద్‌ చేయాలి

 ఫోన్లు బంద్‌ చేయాలి

జొహాన్నెస్‌బర్గ్‌: కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం చాలా శాతం మూతబడినా మొబైల్‌ ఫోన్ల వాడకం తగ్గలేదని దక్షిణాఫ్రికా కోచ్‌ మార్క్‌ బౌచర్‌ అభిప్రాయపడ్డాడు. రెండు వారాల పాటు ఫోన్లను స్విచ్చాఫ్‌ చేస్తే బాగుంటుందని సూచించాడు. ‘గ్లోబల్‌ లాక్‌ డౌన్‌లో సెల్‌ఫోన్‌ వాడకం అంశం ఒక్కటి మిస్‌ అయింది. రెండు వారాల పాటు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసే అంశంపై ఏమంటారు’ అని బౌచర్‌ బుధవారం ట్వీట్‌ చేశాడు. 

 

స్వీయ నిర్బంధంలో సఫారీలు  

భారత్‌తో వన్డే సిరీస్‌ను అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నారు. కరోనా వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను 14 రోజుల పాటు క్రికెటర్లు క్వారంటైన్‌లోకి వెళుతారని క్రికెట్‌ దక్షిణాఫ్రికా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ బుధవారం పేర్కొన్నాడు. 


logo