బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Jan 25, 2021 , 00:54:27

మారిన్‌ మరోసారి

మారిన్‌ మరోసారి

వారం వ్యవధిలో కరోలినాకు రెండో టైటిల్‌ 

పురుషుల సింగిల్స్‌ విజేత అక్సెల్‌సన్‌  

బ్యాంకాక్‌: స్పెయిన్‌ స్టార్‌ షట్లర్‌ కరోలినా మారిన్‌, డెన్మార్క్‌ ఆటగాడు విక్టర్‌ అక్సెల్‌సన్‌ వారం వ్యవధిలో రెండో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టైటిల్‌తో సత్తాచాటారు. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ మారిన్‌ 21-19, 21-17తో టాప్‌సీడ్‌ తై జూ యింగ్‌ (చైనీస్‌ తైపీ)ను మరోసారి చిత్తు చేసి టొయోటా థాయ్‌లాండ్‌ టోర్నీ విజేతగా నిలిచింది. గతవారం కూడా తైజూని వరుస రౌండ్లలో ఓడింటిన ఐదో సీడ్‌ కరోలినా మరోసారి అదే ప్రదర్శనతో ఆకట్టుకుంది. పురుషుల సింగిల్స్‌ తుదిపోరులో నాలుగో సీడ్‌ అక్సెల్‌సన్‌ 21-11, 21-7తో తన దేశానికే చెందిన హాన్స్‌ క్రిస్టియన్‌ విట్టిన్‌గస్‌పై 40 నిమిషాల్లోనే అలవోక విజయం సాధించాడు. గతవారం యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టైటిల్‌ను మారిన్‌, విక్టర్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 

VIDEOS

logo