ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 18, 2021 , 00:13:53

థాయ్‌లాండ్‌ విజేత మారిన్‌

థాయ్‌లాండ్‌ విజేత మారిన్‌

బ్యాంకాక్‌: ఒలింపిక్‌ చాంపియన్‌, స్పెయిన్‌ స్టార్‌ షట్లర్‌ కరోలినా మారిన్‌ అద్భుత ప్రదర్శనతో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో మారిన్‌ 21-9, 21-16తో టాప్‌ సీడ్‌ తైజూ ఇంగ్‌ (చైనీస్‌ తైపీ)ను చిత్తుచేసింది. కరోనా కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన అంతర్జాతీయ టోర్నీ విజేతగా నిలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) చేజిక్కించుకున్నాడు. తుదిపోరులో నాలుగో సీడ్‌ విక్టర్‌ 21-14, 21-14తో లాంగ్‌ అంగూస్‌ (హాంకాంగ్‌)పై 44 నిమిషాల్లోనే విజయం సాధించాడు. కాగా ఈ టోర్నీలో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ సహా భారత్‌ తరఫున అందరూ విఫలమై కనీసం క్వార్టర్స్‌కు కూడా చేరుకోలేకపోయారు. ఈ నెల 19న ప్రారంభం కానున్న మరో థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో పుంజుకోవాలని ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు. 

VIDEOS

logo