శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 08, 2020 , 20:06:39

ఓపెనర్ల మెరుపులు..పవర్‌ప్లే ఆఖరికి ఢిల్లీ స్కోరు 65/0

ఓపెనర్ల మెరుపులు..పవర్‌ప్లే ఆఖరికి ఢిల్లీ స్కోరు 65/0

అబుదాబి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం లభించింది.  శిఖర్‌ ధావన్‌కు జోడీగా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినీస్‌ ఓపెనర్‌గా వచ్చాడు. వీరిద్దరూ తొలి రెండు ఓవర్లను ఆచితూచి ఆడారు. స్టాయినీస్‌ 3* పరుగుల వద్ద  ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సందీప్‌ శర్మ వేసిన మూడో ఓవర్లో  స్టాయినీస్‌ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను సిల్లీ మిడాన్‌లో హోల్డర్‌ వదిలేశాడు. 

అదే ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌కు ఊపుతీసుకొచ్చాడు. హోల్డర్‌ వేసిన నాలుగో ఓవర్లో స్టాయినీస్‌ మూడు ఫోర్లు, సిక్సర్‌ కొట్టి 18 పరుగులు రాబట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సందీప్‌ వేసిన తర్వాతి ఓవర్లో ధావన్‌ వరుసగా రెండు ఫోర్లు  బాదడంతో ఐదో ఓవర్లోనే  స్కోరు 50 మార్క్‌ దాటింది.  శాబాజ్‌ నదీమ్‌ వేసిన ఆరో ఓవర్లో ధావన్‌ ఫోర్‌, సిక్సర్‌ కొట్టడంతో పవర్‌ప్లే ఆఖరికి ఢిల్లీ  65/0తో పటిష్ఠస్థితిలో నిలిచింది. ప్రస్తుతం స్టాయినీస్‌(33), ధావన్‌(30) క్రీజులో ఉన్నారు.