బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 27, 2020 , 00:26:54

రన్నరప్‌ మేఘన

రన్నరప్‌ మేఘన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఆల్‌ ఇండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో తెలంగాణ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి మేఘన రెడ్డి రన్నరప్‌గా నిలిచింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టోర్నీ బాలికల సింగిల్స్‌ ఫైనల్లో మేఘన 10-21, 14-21తో హర్యానా ప్లేయర్‌ మాన్సి సింగ్‌ చేతిలో పరాజయం పాలైంది. 25 నిమిషాల పాటు మ్యాచ్‌ జరుగగా ఆసాంతం మాన్సి ఆధిక్యం ప్రదర్శించింది. మేఘన ప్రస్తుతం గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నది. కాగా, బాలుర సింగిల్స్‌ టైటిల్‌ను హర్ష అరోరా కైవసం చేసుకున్నాడు.


logo