మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 04, 2020 , 03:38:20

మన్‌ప్రీత్‌ సారథ్యంలో భారత్‌

మన్‌ప్రీత్‌ సారథ్యంలో భారత్‌

న్యూఢిల్లీ: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొలీగ్‌లో భాగంగా బెల్జియంతో తలపడబోయే భారత హాకీ జుట్టును సోమవారం ఎంపిక చేశారు. మొత్తం 24 మందితో ప్రకటించిన జట్టుకు మన్‌ప్రీత్‌సింగ్‌ కెప్టెన్‌గా, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రాజ్‌కుమార్‌ పాల్‌ కొత్తగా జట్టుకు ఎంపికయ్యాడు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా ఈనెల 8, 9 తేదీల్లో భారత్‌, బెల్జియం తలపడనున్నాయి. ఇటీవల మలేషియా వేదికగా జరిగిన సుల్తాన్‌ జోహర్‌ కప్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న యువ ఆటగాడు రాజ్‌కుమార్‌ను జట్టులోకి తీసుకోవడంపై చీఫ్‌ కోచ్‌ గ్రహం రీడ్‌ హర్షం వ్యక్తం చేశాడు.

logo
>>>>>>