సోమవారం 23 నవంబర్ 2020
Sports - Sep 26, 2020 , 21:07:35

IPL 2020: మనీశ్‌ పాండే అర్ధశతకం

IPL 2020: మనీశ్‌ పాండే అర్ధశతకం

అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిలకడగా ఆడుతోంది. వన్‌డౌన్‌  బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే అర్ధశతకంతో రాణించాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో మనీశ్‌కు ఇది 16వ అర్ధశతకం కావడం విశేషం.  వృద్ధిమాన్‌ సాహా సహకారం అందిస్తుండగా పాండే విజృంభిస్తున్నాడు. 17 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 2 వికెట్లకు 118 పరుగులు చేసింది. పాండే(50), సాహా(24) క్రీజులో ఉన్నారు. బ్యాట్స్‌మెన్‌ వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తుండగా కోల్‌కతా బౌలర్లు  పరుగులను నియంత్రిస్తున్నారు.