శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 22, 2020 , 22:23:21

RR vs SRH: మనీశ్‌ పాండే మెరుపులు..

RR vs SRH: మనీశ్‌ పాండే మెరుపులు..

దుబాయ్:‌ రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 155 పరుగుల  లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.  వన్‌డౌన్‌లో వచ్చిన పాండే స్వేచ్ఛగా ఆడుతూ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. ఈ జోరులోనే అతడు 28 బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అతనికిది 18వ అర్ధశతకం కావడం  విశేషం. 

స్వల్ప స్కోరుకే ఓపెనర్లు పెవిలియన్‌ చేరినా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. మరో ఎండ్‌లో విజయ్‌ శంకర్‌ నిదానంగా ఆడుతున్నాడు. శ్రేయస్‌ గోపాల్‌ వేసిన  11వ ఓవర్లో  పాండే ఒక ఫోర్‌ బాదగా, శంకర్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో 15  రన్స్‌ వచ్చాయి. 11 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ప్రస్తుతం పాండే(58), శంకర్‌(19) క్రీజులో ఉన్నారు.