Manipur Youth Guinness Record | కనుమూసి తెరిచే లోగా సెకన్ పూర్తవుతుంది.. ఇలా 60 సెకన్లు పూర్తయితే ఒక నిమిషం అవుతుంది. 60 సెకన్లలోనే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు చెందిన 24 ఏండ్ల కుర్రాడు థౌనావోజామ్ నిరంజయ్ సింగ్ (Thounaojam Niranjoy Singh ) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన పాత రికార్డునే బద్దలు కొట్టాడు. ఇంతకుముందు రెండు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదుచేశాడు. తాజాగా ఒక నిమిషంలో 109 పుషప్‌లు ( push-ups ) పూర్తి చేశాడు. గతంలో 105 పుషప్‌లు పూర్తి చేసిన రికార్డు థౌనావోజామ్ నిరంజయ్ సింగ్ ఖాతాలోనే ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంఫాల్‌లో అజ్టెక్స్ స్పోర్ట్స్ నిర్వహించింది.
అద్భుతమైన రికార్డు నెలకొల్పిన మణిపురి యువకుడు థౌనావోజామ్ నిరంజయ్ సింగ్‌ను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు అభినందించాడు. మణిపురి యువకుడు టీ.నిరంజయ్ సింగ్ అద్భుతమైన శక్తి సామర్థ్యాలను చూడటానికి కండ్లు చాలడం లేదు. ఒక నిమిషంలో అత్యధిక పుషప్లతో గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పిన నిరంజయ్ సింగ్ విజయం గర్వకారణం అని ట్వీట్ చేశాడు.