గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 09, 2020 , 20:25:53

మంధాన మెరుపు అర్ధసెంచరీ

 మంధాన మెరుపు అర్ధసెంచరీ

షార్జా:  మహిళల టీ20 ఛాలెంజ్‌లో భాగంగా సూపర్‌నోవాస్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ట్రయల్‌ బ్లేజర్స్‌ దూకుడుగా ఆడుతోంది. బ్లేజర్స్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ధనాధన్‌ బ్యాటింగ్‌తో దుమ్మురేపుతోంది. అనుజా పాటిల్‌ వేసిన రెండో ఓవర్లో మంధాన వరుసగా రెండు ఫోర్లు, సిక్సర్‌ కొట్టి 14 పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ఆఖరికి బ్లేజర్స్‌ జట్టు 45/0తో మెరుగైన స్థితిలో నిలిచింది.

మధ్య ఓవర్లలో నోవాస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వరుసగా నాలుగు ఓవర్లలో కనీసం ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. దీంతో స్కోరు వేగం తగ్గిపోయింది. పూనమ్‌ యాదవ్‌ వేసిన 12వ ఓవర్లో వరుసగా ఫోర్‌, సిక్సర్‌ కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే 38 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. 12 ఓవర్లకు బ్లేజర్స్‌  వికెట్‌ నష్టానికి 85 పరుగులు చేసింది.  మంధాన(60), రిచా ఘోష్‌(0) క్రీజులో ఉన్నారు.