గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 00:47:39

మన్‌దీప్‌ సింగ్‌కు కరోనా

మన్‌దీప్‌ సింగ్‌కు కరోనా

న్యూఢిల్లీ: భారత హాకీ జట్టులో కరోనా వైరస్‌ బారిన పడుతున్న ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పటికే ఐదుగురు ప్లేయర్లకు వైరస్‌ సోకగా, తాజాగా స్టార్‌ ఫార్వర్డ్‌ ప్లేయర్‌ మన్‌దీప్‌ సింగ్‌ ఈ జాబితాలో చేరాడు. వైరస్‌ లక్షణాలు లేకున్నా మన్‌దీప్‌కు జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఈనెల 20న మొదలయ్యే శిక్షణ శిబిరం కోసం బెంగళూరులోని సాయ్‌ జాతీ య శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ఆటగాళ్లు వైరస్‌ బారిన పడుతున్నారు. ఇందులో కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌తో పాటు సురేందర్‌ కుమార్‌, జస్‌కరణ్‌ సింగ్‌, వరుణ్‌ కుమార్‌, గోల్‌కీపర్‌ కిషన్‌ బహదూర్‌ పాఠక్‌ ఇప్పటికే వైరస్‌కు గురయ్యారు.


logo