బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 10, 2020 , 13:51:33

‘రోబో’తో సాతియాన్ ట్రైనింగ్

‘రోబో’తో సాతియాన్ ట్రైనింగ్

న్యూఢిల్లీ: కరోనా వైరస్​తో లాక్​డౌన్ ఉన్నా భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సాతియాన్ జ్ఞానశేఖరన్​ ఇంట్లోనే కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న రోబాట్​(యంత్రం) సాయంతో సన్నాహకాలు చేస్తున్నట్టు శుక్రవారం ఓ ఇంటర్వ్వూలో అతడు చెప్పాడు.

“రోబాట్​తో రోజుకు రెండు గంటలకుపైగా ఆడుతున్నా. ప్రస్తుతం ప్రాక్టీస్ కోసం నాతో ఆడేందుకు ఎవరూ లేరు. ఆట నుంచి పట్టుసడలకుండా ఇప్పుడు రోబాట్​తో ఆడడమే నేను చేయగలిగే అత్యుత్తమమైన పని. అందుకే దానితో ప్రాక్టీస్ చేస్తున్నా” అని సాతియాన్ చెప్పాడు.

ఈ టేబుల్ టెన్నిస్ రోబాట్​ నిమిషానికి 120బంతులను విభిన్న వేగాలతో విసరగలదు. “మనుషులెవరూ ఎదుర్కోలేని వేగం, స్పిన్​తోనూ ఈ రోబాట్ బంతులను విసరగలదు. దీనివల్ల నా సామర్థ్యం పెరిగింది. నా ఫ్లిక్స్​ కూడా మెరుగయ్యాయి” అని సాతియన్ అన్నాడు. అలాగే ఫిట్​నెస్​ను మెరుగుపరుచుకునేందుకు కూడా వర్కౌట్లు చేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఒలింపిక్స్ వాయిదా పడడం మంచిదేనని సాతియాన్ చెప్పాడు. దీని వల్ల ఓ ఏడాది కోల్పోయినట్టు కాదని, మెరుగుపడేందుకు తనకు ఓ ఏడాది సమయం దొరికినట్టు భావిస్తున్నానని చెప్పాడు. ఏప్రిల్​లో టోర్నీలు జరిగి ఉంటే తాను ఒలింపిక్స్ అర్హత సాధించి ఉండేవాడినని సాతియాన్ తెలిపాడు. 


logo