ముంబై : మలైకా అరోరా వయసు 47 ఏళ్లు. అయినా ప్రతి రోజు ఆమె పోస్టు చేసే ఫోటోలు ఓ స్పెషల్. పర్ఫెక్ట్ బాడీషేప్తో ఆమె ప్రజెంట్ చేసే ఫోటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కూడా మలైకా కొన్ని ఫోటోలు పోస్టు చేసింది. తన ఇన్స్టాలో ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. నేను ప్రతి రోజు చేసేది యోగానా.. కేవలం షేప్ కోసమే యోగా చేయను.. అది నా జీవనశైలి అని ఆమె తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. యోగాను జీవన శైలిగా మార్చుకోండి.. అది మీకు బోరింగ్ ఇవ్వదన్నారు. అలా బ్రతకడం ఉత్తమం అనుకుంటున్నట్లు కూడా ఆ బాలీవుడ్ భామ చెప్పింది. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు కూడా చెప్పింది. మలైకా ఫిట్నెస్ రహస్యాల వీడియో మీరూ చూడండి..