బుధవారం 15 జూలై 2020
Sports - May 04, 2020 , 12:55:03

మూడు వారాల సమయమున్నా చాలు: రాయ్​

మూడు వారాల సమయమున్నా చాలు: రాయ్​

న్యూఢిల్లీ: జట్లు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం లేకుంటేనే టీ20 ప్రపంచకప్ వాయిదా గురించి ఆలోచించాలని ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ అభిప్రాయపడ్డాడు. వైరస్ ప్రభావం ముగిశాక ఆటగాళ్లు మళ్లీ సిద్ధమవవడానికి 3వారాల సమయం ఉంటే చాలని ఓ క్రికెట్ వెబ్​సైట్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

“ఆటగాళ్లు సరైన సన్నద్ధతతో లేకున్నా.. ఆస్ట్రేలియాకు వెళ్లలేని పరిస్థితి ఉన్నా.. ప్రపంచకప్​ను వాయిదా వేస్తే అర్థం ఉంటుంది. ఒకవేళ సన్నద్ధమవడానికి మూడు వారాల సమయం దొరికితే మాత్రం టీ20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధంగా ఉంటాం. మా ఆటగాళ్లందరూ అందుకు రెడీగా ఉన్నారు” అని రాయ్ చెప్పాడు. కాగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతుండడంతో ఈ ఏడాది అక్టోబర్​ 18 నుంచి నవంబర్​ 15వ తేదీ వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్​పై సందిగ్ధత పెరుగుతున్నది. 


logo