బుధవారం 08 జూలై 2020
Sports - Apr 20, 2020 , 10:06:23

వాయిదాను వాడుకుంటా

వాయిదాను వాడుకుంటా

టోక్యో ఒలింపిక్స్‌పై భార‌త రెజ్ల‌ర్ పూజా ధండా

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఏడాది జ‌ర‌గాల్సిన ప్ర‌తిష్ఠాత్మ‌క టోక్యో ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా ప‌డ‌టంతో.. అనుకోకుండా ల‌భించిన ఈ స‌మ‌యాన్ని పున‌రాగ‌మ‌నం కోసం వాడుకుంటాన‌ని భార‌త రెజ్ల‌ర్ పూజా ధండా అంటున్న‌ది. ప్ర‌పంచ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్‌లో ప‌త‌కం సాధించిన ఏకైక భార‌త మ‌హిళా రెజ్ల‌ర్ అయిన పూజ‌.. గ‌తేడాది గాయ‌ప‌డింది. అప్ప‌టి నుంచి పున‌రాగ‌మ‌నం కోసం వేచి చూస్తున్న ధండాకు అనుకోని విరామం వ‌రంలో క‌లిసివ‌చ్చింది.

`కొవిడ్‌-19 కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కు మ‌రో ఏడాది గ‌డువు ల‌భించింది. ప్ర‌స్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా. ఘ‌న పున‌రాగ‌మ‌నానికి ఇదే చ‌క్క‌టి అవ‌కాశం. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకొని జాతీయ జ‌ట్టులోకి వ‌స్తా` అని పూజా పేర్కొంది. సాక్షి మాలిక్ త‌ర్వాత ఆ స్థాయి అంచ‌నాలున్న ధండా.. గాయం కార‌ణంగా వెనుక‌బ‌డిపోయిన విష‌యం తెలిసిందే.


logo