శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 21:30:00

మై ప‌ల్‌ దో ప‌ల్‌ కా షాయ‌ర్ హూ.. హార్ట్ ట‌చ్ చేసిన ధోనీ

మై ప‌ల్‌ దో ప‌ల్‌ కా షాయ‌ర్ హూ.. హార్ట్ ట‌చ్ చేసిన ధోనీ

హైద‌రాబాద్ : మై ప‌ల్‌ దో ఫ‌ల్ కా షాయ‌ర్ హూ.. ప‌ల్‌ దో ఫ‌ల్ మేరీ క‌హానీ హై.. ప‌ల్‌ దో ఫ‌ల్ మేరీ హ‌స్తీ హై.. ప‌ల్‌ దో ఫ‌ల్ మేరీ జ‌వానీ హై.. ఇదో బాలీవుడ్ పాట‌.  ధోనీ త‌న కెరీర్‌కు చెందిన బెస్ట్ ఫోటోస్‌తో రిటైర్మెంట్‌ వీడియోను రూపొందించాడు. ఆ వీడియోకు ఈ సాంగ్‌ను వాడాడు. త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసిన రిటైర్మెంట్ కామెంట్స్‌తో పాటు ఈ వీడియోను అటాచ్ చేశాడు.  మై ప‌ల్‌‌ దో ప‌ల్‌ కా షాయ‌ర్ హూ అనే పాట బాలీవుడ్‌లో క్లాసిక్ సాంగ్‌. 1976లో రిలీజైన క‌బీ క‌బీ చిత్రంలోనిది.  అమితాబ్ న‌టించిన ఆ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది.  ముఖేశ్ ఈ పాట‌ను పాడారు.  ఖ‌య్య‌మ్ దీనికి సంగీతం అందించారు.  సాహిర్ లుదియాన్వి ఈ పాట‌ను రాశారు. య‌శ్ చోప్రా ఆ సినిమాకు డైర‌క్ట‌ర్‌గా చేశారు. ఈ సినిమాలో ఉన్న అన్ని పాట‌లు హైలెట్‌.  ఖ‌య్య‌మ్ స్వ‌ర‌ప‌రిచిన‌ బాణీలు అప్పట్లో సినీ ప్రేక్ష‌కుల్ని ఎంతో థ్రిల్ చేశాయి. ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అవార్డు కూడా ద‌క్కింది. అయితే ధోనీ త‌న రిటైర్మెంట్ వీడియోకు ఈ పాట‌ను ఎంపిక చేసుకున్న తీరు అత‌ని మ‌న‌సును తెలుపుతున్న‌ది.

logo