మాడ్రిడ్: మట్టికోర్టుపై సూపర్ ఫామ్ కొనసాగించిన జర్మనీ స్టార్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మాడ్రిడ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ జ్వెరెవ్ 6-7 (10/8), 6-4, 6-3 తేడాతో మాటో బెరెటినీ(ఇటలీ)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో టాప్ సీడ్ రఫేల్ నాదల్‌ను, సెమీస్‌లో నాలుగో ర్యాంకర్ డొమినిక్ థీమ్‌ను మట్టికరిపించిన అలెగ్జాండర్ ఫైనల్లోనూ సత్తాచాటాడు. 2 గంటల 40 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో తొలి సెట్ కోల్పోయినా ఆ తర్వాత పూర్తి ఆధిపత్యంతో విజయం సాధించాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆష్లే బార్టీని ఓడించి అర్యానా సబెలెంక (బెలారస్) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.