శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Nov 13, 2020 , 10:32:25

కృనాల్ పాండ్యా ల‌గ్జ‌రీ వ‌స్తువులు క‌స్ట‌మ్స్‌కు అప్ప‌గింత‌..

కృనాల్ పాండ్యా ల‌గ్జ‌రీ వ‌స్తువులు క‌స్ట‌మ్స్‌కు అప్ప‌గింత‌..

హైద‌రాబాద్‌: ముంబై ఇండియ‌న్స్ ప్లేయ‌ర్ కృనాల్ పాండ్యా నుంచి ముంబై విమానాశ్ర‌యంలో రెవ‌న్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు ల‌గ్జ‌రీ వాచీల‌ను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌లో జ‌రిగిన ఐపీఎల్ టోర్నీలో కృనాల్ పాండ్యా.. ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు.  ఐపీఎల్ టోర్నీని ఆ జ‌ట్టు కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే తిరిగి ఇండియాకు ప‌య‌నం అయి వ‌స్తున్న కృనాల్ నుంచి లెక్క‌ల్లో చూప‌ని బంగారాన్ని, ల‌గ్జ‌రీ వాచీల‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాస్త‌వానికి డీఆర్ఐ ప్ర‌మాణాల ప్ర‌కారం ఇది చాలా చిన్న కేసు అని అధికారులు చెబుతున్నారు. కానీ కృనాల్ నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం, వాచీల‌ను య‌ధావిధిగా ఎయిర్‌పోర్ట్ క‌స్ట‌మ్స్ అధికారుల‌కు అంద‌జేసిన‌ట్లు డీఆర్ఐ పేర్కొన్న‌ది.