మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Sep 19, 2020 , 21:36:20

IPL 2020: చెన్నై లక్ష్యం 163

IPL 2020: చెన్నై లక్ష్యం 163

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌  మంచి స్కోరే చేసింది.  ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(33), సౌరభ్‌ తివారీ(42) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో లుంగీ ఎంగిడి మూడు వికెట్లు తీయగా దీపక్‌ చాహర్‌, జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(12) విఫలమయ్యాడు. ఆరంభంలో డికాక్‌ వేగంగా ఆడటంతో 4 ఓవర్ల ముగిసేసరికి 45 పరుగులు సాధించింది. ముంబై ఇన్నింగ్స్‌ జోరుగా సాగుతుండగా చెన్నై స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా వేసిన ఐదో ఓవర్‌ నాలుగో బంతికి రోహిత్  తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.  డీకాక్  కూడా  ఆ తర్వాత ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సౌరభ్‌ చెన్నైబౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ షాట్లతో చెలరేగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న ముంబైకి జడేజా బ్రేకులు వేశాడు. 

ఒకే ఓవర్‌లో ఇద్దరు కీలక ఆటగాళ్లు తివారీ, హార్డిక్‌ పాండ్యను ఔట్‌ చేసి చెన్నై శిబిరంలో ఉత్సాహం నింపాడు. క్రీజులోకి రాగానే పాండ్య రెండు సిక్సర్లు బాది ప్రమాదకరంగా కనిపించాడు. అదే ఓవర్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ భారీ సిక్సర్లు కొట్టే ప్రయత్నంలో బౌండరీ లైన్‌ వద్ద డుప్లెసిస్‌ కళ్లుచెదిరే క్యాచ్‌లకు వీరిద్దరూ నిరాశగా వెనుదిరిగారు. మ్యాచ్‌లో అదే టర్నింగ్‌ పాయింట్‌. ఇక ఆఖర్లో టెయిలెండర్లు వేగంగా ఆడాలని ప్రయత్నించినా చెన్నై బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టారు.