శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 01, 2020 , 16:06:16

మయాంక్‌ అగర్వాల్‌ బౌల్డ్‌

మయాంక్‌ అగర్వాల్‌ బౌల్డ్‌

అబుదాబి: ప్లేఆఫ్‌  ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పని సరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌  ఆచితూచి ఆడుతోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న పంజాబ్‌కు అదిరే ఆరంభం లభించింది. ఐతే దూకుడుగా ఆడే క్రమంలో   ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(26) ఎంగిడి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 48 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 

దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్లో రెండు పోర్లు బాదిన మయాంక్‌ 10 రన్స్‌ రాబట్టి ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించాడు. మరో ఎండ్‌లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు.  పవర్‌ప్లే ఆఖరికి పంజాబ్‌  53/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతం రాహుల్‌(26), క్రిస్‌గేల్‌(1) క్రీజులో ఉన్నారు.