గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Sep 03, 2020 , 12:29:02

2028 ఒలింపిక్స్‌ లోగో ఇదే..!

2028 ఒలింపిక్స్‌ లోగో ఇదే..!

లాస్‌ఏంజెల్స్‌:  2028 ఒలింపిక్స్‌కు అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ నగరం ఆతిథ్యమివ్వనుంది. 2028 సమ్మర్‌ ఒలింపిక్స్‌, పారాలింపిక్ గేమ్స్‌కు సంబంధించిన అధికారిక లోగోలను విశ్వ క్రీడల నిర్వాహక కమిటీ ఆవిష్కరించింది. ఇది యానిమేటెడ్‌ మాత్రమే కాదు, నగరం ఆత్మను ప్రతిబింబించేలా డిజైన్‌ చేసినట్లు కమిటీ పేర్కొంది.

ఈసారి వినూత్నంగా ‘ఎల్‌ఏ అక్షరాల కింద 28 నంబర్‌..దాని కింద ఒలింపిక్స్‌ చిహ్నాన్ని ఉంచారు.  కరోనా కారణంగా టోక్యో వేదికగా జరగాల్సిన 2020  ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే.  2024 ఒలింపిక్స్‌కు పారిస్‌ నగరం ఆతిథ్యమివ్వనుంది. logo