గురువారం 09 జూలై 2020
Sports - Jun 26, 2020 , 11:45:42

ప్రీమియర్‌ లీగ్‌ విజేతగా లివర్‌పూల్‌

ప్రీమియర్‌ లీగ్‌ విజేతగా లివర్‌పూల్‌

లండన్: ముప్పై ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రతిష్టాత్మక ప్రీమియర్‌ లీగ్‌ ఛాంపియన్స్‌గా లివర్‌పూల్‌ జట్టు అవతరించింది.  ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఫుట్‌బాల్‌  ప్రీమియర్ లీగ్​(2019/20)​లో లివర్​పూల్ ఎఫ్‌సీ జట్టు విజేతగా నిలిచింది.  గురువారం జరిగిన మ్యాచ్‌లో చెల్సియా జట్టు 2-1తో మాంచెస్టర్‌పై విజయం సాధించడంతో  లివర్‌పూల్‌ టైటిల్‌ ఖాయమైంది.   ఇంకా 7 మ్యాచ్​లు మిగిలుండగానే లివర్‌పూల్‌ టైటిల్​ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. 

ఓ ప్రీమియర్ లీగ్​ సీజన్​లో సొంతగడ్డపై జరిగిన అన్ని మ్యాచ్​ల్లోనూ గెలిచిన తొలి జట్టుగా లివర్​పూల్ అవతరించింది. సొంతగడ్డపై వరుసగా 23 మ్యాచ్​లు గెలిచి రికార్డు సృష్టించింది.  లీగ్‌లో భాగంగా లివర్‌పూల్‌ 31 మ్యాచ్‌లు ఆడి 86 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మాంచెస్టర్‌ సిటీ 31 మ్యాచ్‌లు ఆడి 63 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.  లివర్‌పూల్‌ చివరిసారిగా 1989-90లో ఛాంపియన్‌గా నిలిచింది. లివర్‌పూల్‌కు ఇది 19వ టైటిల్‌ కాగా.. ఆ జట్టుకు 1989 తర్వాత ఇదే అతిపెద్ద టైటిల్‌. 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సిటీ మేయర్‌ సూచించినప్పటికీ విజయానందంలో అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఫ్యాన్స్‌ భౌతిక దూరం పాటించకుండా సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. 30ఏండ్లలో  సొంతగడ్డపై లీగ్​లో దక్కించుకోని టైటిల్​ను లివర్‌పూల్‌ ఈసారి కైవసం చేసుకున్నది.  ప్రీమియర్ లీగ్​లోని ఓ సీజన్​లో మాంచెస్టర్ యునైటెడ్(2000-01), మాంచెస్టర్ సిటీ(2017-18) 5 మ్యాచ్​లు మిగిలుండగానే కప్పు గెలిచాయి. ఐతే లివర్​ పూల్ మాత్రం 7 మ్యాచ్​లుండగానే విజేతగా నిలిచి రికార్డు నెలకొల్పింది. 


logo