బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 15, 2020 , 23:18:52

ఇండ్లలోనే ఉండండి: మెస్సీ

ఇండ్లలోనే ఉండండి: మెస్సీ

బార్సిలోనా: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ కోరాడు. అందరూ ఇండ్లలోనే ఉండాలని సూచించాడు. వైరస్‌ కారణంగా స్పానిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ రద్దవడంతో ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న అతడు.. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రజలకు సందేశమిచ్చాడు. ‘కరోనా వైరస్‌ బాధితులతో పాటు అరికట్టేందుకు పోరాడుతున్న వారందరికీ నా పూర్తి మద్దతు తెలుపుతున్నా. ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాల సూచనలు అందరూ పాటించాలి. ఇంట్లోనే ఉండాలి. ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అందరికీ ఆరోగ్యమే ముఖ్యం. త్వరలోనే పరిస్థితి సద్దుమణుగుతుందని ఆశిస్తున్నా’ అని మెస్సీ పేర్కొన్నాడు. 


logo
>>>>>>