శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 09, 2020 , 03:19:33

ఐపీఎల్‌ ఆడేందుకు ఇష్టపడతా: పుజార

ఐపీఎల్‌ ఆడేందుకు ఇష్టపడతా: పుజార

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ వేలం లో తనను ఏ జట్టు తీసుకోకపోవడం ఎప్పుడూ చిరాకు, కోపం కలిగించలేదని టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజార చెప్పాడు. అయి తే అవకాశమొస్తే ఐపీఎల్‌ ఆడేందుకు తాను ఇష్టపడతానని అతడు మంగళవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.  పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అవకాశాలు వస్తే నిరూపించుకుంటానని  అన్నాడు. ‘ఐపీఎల్‌ వేలం ఒక్కోసారి చమత్కారంగా ఉంటుంది. అందుకే ఏ ఫ్రాంచైజీ నన్ను తీసుకోకున్నా ఎలాంటి చిరాకు, అహం లేవు. హషీమ్‌ ఆమ్లా లాంటి మంచి ఆటగాడు కూడా వేలంలో అమ్ముడుపోలేదు’ అని పుజార అన్నాడు.


logo