శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 25, 2020 , 17:18:10

నిజాలు క‌ఠినంగా ఉంటాయి : ధావ‌న్‌ (వీడియో)

నిజాలు క‌ఠినంగా ఉంటాయి : ధావ‌న్‌ (వీడియో)

క‌రోనా వైర‌స్ కార‌ణంగా టోర్నీల‌న్నీ ర‌ద్దుకావ‌డంతో టీమీండియా క్రికెట‌ర్లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్రాక్టీస్ సెష‌న్స్‌కు దూరం ఉంటున్న వారంతా భార్య‌పిల్ల‌ల‌తో విరామ స‌మ‌యాన్ని  ఆస్వాదిస్తున్నారు.  ఇంట్లో వారం రోజులు ఉన్న త‌ర్వాత త‌న జీవితంలో వ‌చ్చిన మార్పుల‌ను  టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్‌ధావ‌న్ ఓ ఫ‌న్నీ వీడియో ద్వారా చూపించారు. ఈ వీడియోలో శిఖ‌ర్ ధావ‌న్ బ‌ట్ట‌లు ఉతుకుతుండ‌గా ఆయ‌న భార్య అయేషా మేక‌ప్ వేసుకుంటూ క‌నిపిస్తున్న‌ది. ఆ త‌ర్వాత ధావ‌న్‌ను క‌ర్ర‌తో బెదిరిస్తూ  వాష్‌రూమ్‌ను క్లీన్ చేయిస్తున్న‌ది అయేషా. ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ధావ‌న్ నిజాలు ఎప్పుడూ క‌ఠినంగానే ఉంటాయ‌ని పేర్కొన్నారు. ధావ‌న్‌పై ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ సానుభూతిని కురిపించారు. ధావ‌న్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ది.logo