గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 16, 2020 , 23:39:50

హామిల్టన్‌ @ 88

 హామిల్టన్‌ @ 88

మాంట్‌మెలో: బ్రిటన్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన స్పానిష్‌ గ్రాండ్‌ ప్రి రేసును హామిల్టన్‌ కైవసం చేసుకున్నాడు. చాంపియన్‌షిప్‌లో 37 పాయింట్లతో టాప్‌లో కొనసాగడంతో పాటు 88వ టైటిల్‌ ద్వారా దిగ్గజ రేసర్‌ మైఖేల్‌ షుమాకర్‌(91)కు మూడు అడుగుల దూరంలో నిలిచాడు. పోల్‌ పొజిషన్‌ నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్‌..ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగాడు. వెర్‌స్టాపెన్‌(రెడ్‌బుల్‌), బొటాస్‌(మెర్సిడెస్‌) వరుసగా రెండు, మూడు స్థానాలతో పోడియం ఫినిష్‌ చేశారు. 


logo