శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 00:38:38

హామిల్టన్‌ ఏడోసారి బ్రిటన్‌ గ్రాండ్‌ప్రి కైవసం

హామిల్టన్‌ ఏడోసారి  బ్రిటన్‌ గ్రాండ్‌ప్రి కైవసం

సిల్వర్‌స్టోన్‌: బ్రిటన్‌ గ్రాండ్‌ ప్రిలో మెర్సిడెస్‌ స్టార్‌ రేసర్‌, ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరోసారి సత్తాచాటాడు. ఆదివారం ఇక్కడ జరిగిన రేస్‌లో టాప్‌లో నిలిచి ఏడోసారి బ్రిటన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. చివరి ల్యాప్‌లో టైర్‌ పంక్చర్‌ అయినా.. రెండో స్థానంలో నిలిచిన మాక్స్‌ వెర్‌స్టాపెన్‌(రెడ్‌బుల్‌) కంటే ముందుగానే హామిల్టన్‌ లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచాడు.  ఫెరారీ రేసర్‌ లెక్‌లెర్క్‌ మూడో స్థానం దక్కించుకున్నాడు. కాగా బ్రిటన్‌ రేసర్‌ హామిల్టన్‌కు కెరీర్‌లో ఇది 87వ టైటిల్‌ కాగా, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ మైకేల్‌ షూమాకర్‌ (91) రికార్డుకు మరింత చేరువయ్యాడు. 


logo