బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 04, 2020 , 21:16:56

మార్గ‌నిర్దేశ‌కుల కోసం వెలుగులు నింపుదాం: హార్దిక్ పాండ్యా

మార్గ‌నిర్దేశ‌కుల కోసం వెలుగులు నింపుదాం: హార్దిక్ పాండ్యా

న్యూఢిల్లీ:  విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా పోరాడుతున్న యోధుల‌కు సంఘీభావం తెలుపాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ప్రధాని న‌రేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేర‌కు ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆపేసి.. కొవ్వ‌త్తులు, దీపాల ద్వారా మ‌న ఐక్య‌త చాటాల‌ని పాండ్యా కోరాడు. 

`చీక‌టి నుంచి వెలుగులోకి దారి చూపిస్తున్న మార్గ‌ద‌ర్శ‌కుల కోసం.. కొవ్వ‌త్తులు వెలిగిద్దాం. టీమ్ఇండియా స్ఫూర్తితో ముందుకు సాగుదాం. ఇంటి ముందు గీసుకున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాట‌కుండా ఈ ప‌నిచేద్దాం` అని పాండ్యా శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపాడు.


logo