శుక్రవారం 03 జూలై 2020
Sports - Apr 05, 2020 , 12:38:09

ప్రపంచానికి మన ఐక్యత చాటండి: కోహ్లీ, రోహిత్

ప్రపంచానికి మన ఐక్యత చాటండి: కోహ్లీ, రోహిత్

న్యూఢిల్లీ : కరోనా వైరస్​పై చేస్తున్న యుద్ధానికి సూచికగా నేడు(ఆదివారం) రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పి.. దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్​లైట్లు వెలిగించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు క్రీడాలోకం మద్దతు తెలుపుతూనే ఉంది. టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్​ శర్మ.. ప్రధాని పిలుపును పాటించాలని ట్విట్టర్ వేదికగా అభిమానులను ఆదివారం కోరారు.

“స్డేడియానికి శక్తి అభిమానుల నుంచి వస్తుంది. భారతీయ స్ఫూర్తి ప్రజల్లోనే ఉంది. ఈ రోజు రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు.. ప్రపంచానికి చూపించండి.. మేమందరం ఒక్కటిగా ఉన్నామని. వైద్య సిబ్బందికి తెలుపండి.. మీ వెనుక మేమున్నామని. టీమ్​ఇండియా ప్రజ్వలించాలి” అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

“’టీమ్​ఇండియా.. ఈ టెస్టు మ్యాచ్​ను గెలువడంపైనే మన జీవితం అధారపడి ఉంది. మీ సంఘీభావం తెలుపండి. టీమ్ఇండియా గొప్ప యుద్ధంలో భాగస్వాములు కండి. ఈ రోజు రాత్రి 9 గంటలకు.. 9 నిమిషాల పాటు.. యుద్ధం కోసం వెలుగులు విరజిమ్మండి” అని రోహిత్ ట్వీట్​ చేశాడు.

కరోనా వైరస్ కారణంగా క్రికెట్ నిలిచిపోవడంతో ఆటగాళ్లు స్వీయ నిర్బంధంలో ఉంటూ కుటుంబాలతో గడుపుతున్నారు. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కరోనా వైరస్​పై ప్రజల్లో అహగాహన పెంచాలని క్రీడాకారులకు ప్రధాని మోదీ సూచించారు. ఈ సమావేశంలో కోహ్లీ, రోహిత్​తో పాటు మొత్తం వివిధ క్రీడలకు చెందిన మొత్తం 49మంది పాల్గొన్నారు.


logo