గురువారం 09 జూలై 2020
Sports - Apr 25, 2020 , 21:08:14

మెరుపు పోగ‌ట్టాలంటే.. రుద్దాల్సిందే

మెరుపు పోగ‌ట్టాలంటే.. రుద్దాల్సిందే

రెడ్ బాల్ షైనింగ్‌పై నెహ్రా, హ‌ర్భ‌జ‌న్ వ్యాఖ్య‌

న్యూఢిల్లీ: స‌ంప్ర‌దాయ క్రికెట్‌లో బంతి మెరుపును పోగొట్టేందుకు ఉమ్మి (స‌లైవా) రాయ‌డానికి మించిన మ‌రో మార్గం లేద‌ని భార‌త మాజీ ఆట‌గాళ్లు నెహ్రా, హ‌ర్భ‌జ‌న్ సింగ్ పేర్కొన్నారు. రివ‌ర్స్‌స్వింగ్ రాబ‌ట్టాలంటే అంత‌కుమించిన మార్గం లేద‌ని అన్నారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా బాల్‌పై ఉమ్మి పెట్ట‌డానికి ప్లేయ‌ర్లు ముందుకు రాక‌పోవ‌చ్చ‌నే అభిప్రాయాల మ‌ధ్య ఈ ఇద్ద‌రు పై వ్యాఖ్య‌లు చేశారు. 

`చెమ‌ట‌, ఉమ్మి రుద్దుక‌పోతే బాల్ స్వింగ్ కాదు. ఇది వంద‌కు వంద శాతం నిజం. బంతిని స్వింగ్ చేయాల‌నంటే అది త‌ప్ప‌నిస‌రి. కొత్త బంతి ఒక‌వైపు మెరుపు కోల్పోతేనే బౌల‌ర్ల‌కు ల‌బ్ది చేకూరుతుంది` అని నెహ్రా అన్నాడు. పేస‌ర్ల‌కే కాదు స్పిన్న‌ర్ల‌కు ఇద్ది ఇబ్బందిదాయ‌క‌మే అని భ‌జ్జీ చెప్పాడు. కొవిడ్‌-19 నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి.. బాల్ ట్యాంప‌రింగ్‌ను అనుమ‌తివ్వాల‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అంపైర్ల స‌మ‌క్షంలో బంతిపై జెల్ రాసే విధంగా నిబంధ‌న‌ల్లో మార్పులు చేయాల‌నే యోచ‌న ఉన్న‌ట్లు స‌మాచారం. logo