శనివారం 28 మార్చి 2020
Sports - Jan 24, 2020 , 12:46:49

భారత క్రికెట్‌ జట్టు సెల‌క్ట‌ర్ల‌ రేసులో ..

భారత క్రికెట్‌ జట్టు  సెల‌క్ట‌ర్ల‌  రేసులో ..

ప్ర‌స్తుత సెల‌క్ష‌న్ క‌మిటీలో స‌భ్యులైన ఎమ్మెస్కే ప్ర‌సాద్‌(సౌత్ జోన్‌), గ‌గ‌న్ ఖోడా(సెంట్ర‌ల్ జోన్‌)ల స్థానంలో మ‌రో ఇద్ద‌రిని సెలక్ష‌న్ ప్యానెల్‌కు ఎంపిక చేయ‌నున్నారు.

ముంబై:  టీమిండియా  మాజీ లెగ్ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్  నేష‌న‌ల్‌ సెలెక్టర్‌ పోస్టుకు దరఖాస్తు చేశాడు. అతడితో పాటు మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ రాజేశ్‌ చౌహాన్‌,  లెఫ్ట్ హ్యాండెడ్‌ బ్యాట్స్‌మన్ ఆమేయ్ ఖురేసియా కూడా  ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.  ఈ ముగ్గురు మాజీ క్రికెట‌ర్లు సెల‌క్ట‌ర్ ప‌ద‌వికి అప్లై చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.    శివరామకృష్ణన్ 20ఏండ్లుగా కామెంటేట‌ర్‌గా ప‌నిచేశారు. నేష‌నల్ క్రికెట్ అకాడ‌మీలో స్పిన్ బౌలింగ్ కోచ్‌గానూ సేవ‌లందించారు. 

దరఖాస్తులు  దాఖలు చేసేందుకు శుక్రవారమే ఆఖ‌రి తేదీ.  ప్ర‌స్తుత సెల‌క్ష‌న్ క‌మిటీలో  స‌భ్యులైన  ఎమ్మెస్కే ప్ర‌సాద్‌(సౌత్ జోన్‌),  గ‌గ‌న్ ఖోడా(సెంట్ర‌ల్ జోన్‌)ల స్థానంలో మ‌రో ఇద్ద‌రిని సెలక్ష‌న్ ప్యానెల్‌కు ఎంపిక చేయ‌నున్నారు.  శ‌ర‌ణ్‌దీప్ సింగ్‌, జ‌తిన్ ప‌రాంజ్‌పే, దేవాంగ్ గాంధీలు మ‌రో సీజ‌న్ వ‌ర‌కు సెల‌క్ట‌ర్లుగా కొన‌సాగ‌నున్నారు.    మాజీ జూనియర్‌ సెలెక్టర్‌ ప్రీతమ్‌ గాంధీ, ప్రస్తుత జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ సభ్యుడు జ్ఞానేంద్ర పాండే కూడా  సెల‌క్ట‌ర్ ప‌ద‌వి కోసం దరఖాస్తు చేసిన‌ట్లు తెలిసింది.  మాజీ జూనియ‌ర్ సెల‌క్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ వెంక‌టేశ్ ప్ర‌సాద్‌, భార‌త మాజీ బ్యాటింగ్ కోచ్ సంజ‌య్ బంగ‌ర్ కూడా సెల‌క్ట‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. 


logo