మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 04, 2020 , 03:53:06

యువతకు లక్ష్మణ్‌రెడ్డి ఆదర్శం

 యువతకు లక్ష్మణ్‌రెడ్డి ఆదర్శం
  • రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ విద్యాసంస్థల చైర్మన్‌ మర్రి లక్ష్మణ్‌ రెడ్డి నేటి యువతకు ఆదర్శమని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అక్వా డెవిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణ రివర్‌ క్రాస్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో 75 ఏండ్ల లక్ష్మణ్‌ రెడ్డి 1.5 కి.మీటర్ల దూరాన్ని 50.49 నిమిషాల్లో ఈది విజయం సాధించారు. ఈ సందర్భంగా సోమవారం లక్ష్మణ్‌రెడ్డిని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రత్యేకంగా అభినందించారు. మహిళల విభాగంలో గోలి శ్యామల(1.5కి.మీలు, 26.58ని) మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు ఈనెల 7 నుంచి హర్యానాలో జరిగే జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ టోర్నీలో క్రీడాకారులు ధరించే ట్రాక్‌ సూట్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాస్టర్స్‌ అసోసియేషన్‌ శాశ్వత అధ్యక్షులు లక్ష్మణ్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్‌, కోశాధికారి లక్ష్మి, ఉపాధ్యక్షుడు శంకర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>