ఆదివారం 12 జూలై 2020
Sports - May 02, 2020 , 17:29:55

ల‌క్ష్మ‌ణ్ టెక్నిక్ అమోఘం

ల‌క్ష్మ‌ణ్ టెక్నిక్ అమోఘం

న్యూఢిల్లీ:  టెస్టు క్రికెట్‌లో టెక్నిక్ ప‌రంగా భారత మాజీ ఆట‌గాడు వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఎంతో ముందుంటాడ‌ని ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ బ్రెట్‌లీ అన్నాడు. అత‌డి వికెట్ ప‌డ‌గొట్టాలంటే బౌల‌ర్లు తీవ్రంగా శ్ర‌మించ‌క త‌ప్ప‌దని లీ చెప్పాడు. ఆసీస్ పేరు చెబితేనే చెల‌రేగిపోయాఏ ల‌క్ష్మ‌ణ్ కంగారూల‌పై ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌ల‌తో అల‌రించిన విష‌యం తెలిసిందే. అందుకే ఆసీస్ మాజీలు వీవీఎస్‌ను ముద్దుగా వెరీ వెరీ స్పెష‌ల్ అని పిలుచుకునేవారు.

`ల‌క్ష్మ‌ణ్ టెక్నిక్ అమోఘం. అత‌డి డిఫెన్స్‌ను ఛేదించ‌డం ఎవ‌రికైనా క‌ష్ట‌మే.. స్పెష‌ల్ వికెట్ ప‌డ‌గొట్టాలంలే అంత‌కంటే స్పెష‌ల్‌గా బౌలింగ్ చేయ‌క త‌ప్ప‌దు. క్రీజులో అత‌డి పాదాల క‌ద‌లిక‌.. మ‌ణిక‌ట్టు మాయాజాలం చూస్తుంటే ముచ్చ‌టేస్తుంది. ఒక సారి ల‌క్ష్మ‌ణ్ ల‌య అందుకున్నాడంటే.. ఎదురుగా బౌలింగ్ చేస్తున్న‌ది ఎవ‌రు అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తాడు` అని బ్రెట్‌లీ అన్నాడు. 


logo