బుధవారం 08 జూలై 2020
Sports - May 24, 2020 , 22:07:49

ఈ మనిషి శక్తికి సెల్యూట్‌: వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఈ మనిషి శక్తికి సెల్యూట్‌: వీవీఎస్‌ లక్ష్మణ్‌

హైదరాబాద్‌: మనిషిలోని శక్తి, సహనం ఒక పట్టాన అర్థం కావు. సంకల్పం ఉండాలిగానీ ఎంతటి వైకల్యమైనా దిగదుడుపే అవుతుంది. దీక్ష, పట్టుదలతో మైదానంలోకి దిగి అనుకొన్నది సాధించడమే కాకుండా అందరిలోనూ స్ఫూర్తి రగిలించాడు ఓ వైకల్యంతో బాధపడుతున్న పిల్లాడు. నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న క్రికెటర్లకు అంగవైకల్యంతో బాధపడుతూ కూడా మామూలు బౌలర్‌ మాదిరిగా బౌలింగ్ చేస్తున్న పిల్లాడి వీడియోను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 'మానవ ఆత్మ అనేది ఏ పరిస్థితిని సైతం దొంగిలించలేని సామర్ధ్యం, పట్టుదల, ధైర్యం. మానవ ఓర్పు మరియు బలం కలిగివున్న ఈ ఆత్మకు వందనం' అని వీడియో కింద లక్ష్మణ్‌ రాశారు. 

కరోనా వైరస్‌ బారినపడి క్వారంటైన్‌ ఉంటూనే విద్యార్థులకు ఆన్‌లైన్‌ గణితం పాఠాలు చెప్తున్న లడక్‌కు చెందిన గణితం మాస్టారు కైఫియత్‌ హుస్సేన్‌ వీడియోను కూడా ఇటీవల వీవీఎస్‌ లక్ష్మణ్‌ పోస్ట్‌ చేసి..  అతడి ఆత్మ ఒక ప్రేరణ అని ప్రశంసించారు. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్‌.. కొవిడ్‌-19 నేపథ్యంలో బెంగాల్‌ క్రికెటర్లకు ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్పిస్తుండటం విశేషం.


logo