శుక్రవారం 05 మార్చి 2021
Sports - Jan 29, 2021 , 02:26:33

పాక్‌దే పైచేయి

పాక్‌దే పైచేయి

  • దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు

కరాచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నది. టాపార్డర్‌ విఫలమైనా.. లోయర్‌ ఆర్డర్‌ పోరాడటంతో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులు చేసింది. యాసిర్‌ షా (38), నౌమన్‌ అలీ (24) విలువైన పరుగులు జోడించారు. సఫారీ బౌలర్లలో రబాడ, కేశవ్‌ మహారాజ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 158 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 187/4తో నిలిచింది. మార్క్మ్‌ (74), డసెన్‌ (64) అర్ధశతకాలు సాధించారు. యాసిర్‌ షాకు మూడు వికెట్లు దక్కాయి. చేతిలో 6 వికెట్లు ఉన్న సఫారీ జట్టు 29 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్‌ డికాక్‌ (0), కేశవ్‌ మహారాజ్‌ (2) క్రీజులో ఉన్నారు. 

VIDEOS

logo