శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 19:04:11

ముంబై ఇండియన్స్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం

ముంబై ఇండియన్స్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం

కొలంబో:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.  శ్రీలంక సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ లసిత్‌ మలింగ వ్యక్తిగత కారణాలతో రాబోయే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి తప్పుకున్నాడు.  మలింగ తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. మలింగ స్థానంలో ఆస్ట్రేలియా పేసర్‌ జేమ్స్‌ పాటిన్సన్‌ను ముంబై జట్టులోకి తీసుకున్నది. 

ఈ వారాంతంలో అబుదాబిలోని  ముంబై జట్టుతో పాటిన్సన్‌ టీమ్‌తో చేరనున్నాడు.  గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఫైనల్లో మలింగ గొప్పగా బౌలింగ్‌ చేసి ముంబైకి నాలుగో టైటిల్‌ అందించాడు. మలింగ దూరమవడం జట్టు బౌలింగ్‌పై ప్రభావం చూపనుంది. 


logo