మంగళవారం 14 జూలై 2020
Sports - May 08, 2020 , 18:13:47

లారాతో పాటు ఉన్న‌దెవ‌రో తెలుసా..?

లారాతో పాటు ఉన్న‌దెవ‌రో తెలుసా..?

న్యూఢిల్లీ:  వెస్టిండీస్ దిగ్గ‌జం బ్రియాన్ లారాతో క‌లిసి ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తిని గుర్తు ప‌ట్టారా.. టీమ్ఇండియా త‌ర‌ఫున వంద‌ల మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వ‌హించిన ఆట‌గాడు.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడు.. భార‌త్ నుంచి మూడు ఫార్మాట్‌ల‌లో శ‌త‌కాలు బాదిన ఆట‌గాడు.. పొట్టి ఫార్మాట్‌లో టీమ్ఇండియా త‌ర‌ఫున తొలి సెంచ‌రీ చేసిన హీరో..!

ఏంటీ.. ఇప్ప‌టికీ గుర్తు ప‌ట్ట‌లేదా.. అయితే మ‌రొక్క క్లూ.. మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి ప్రీతిపాత్రుడు, ఆప్త మిత్రుడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు స‌భ్యుడు.. 

ఆ..! అత‌డే సురేశ్ రైనా..!

కెరీర్ ఆరంభానికి ముందు విండీస్ దిగ్గ‌జంతో సురేశ్ రైనా ముచ్చ‌ట‌ప‌డి ఫొటో దిగాడు. ఆ త‌ర్వాత ఆ విష‌యం మ‌ర్చిపోయాడు. తాజాగా శుక్ర‌వారం లారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోను పోస్ట్ చేసి `ఈ యువ ఆట‌గాడిని గుర్తు ప‌ట్టారా? అభిమానుల ఉత్సాహం. త‌ర్వాతి కాలంలో అత‌డు స్టార్ ప్లేయ‌ర్‌గా ఎదిగాడు` అని క్యాప్ష‌న్ పెట్టాడు. దీంతో ఇన్‌స్టాలో రైనా, లారా అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.


logo