ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 22:42:27

లంక ప్రీమియ‌ర్ లీగ్ వాయిదా

 లంక ప్రీమియ‌ర్ లీగ్ వాయిదా

న్యూఢిల్లీ:  తొలిసారి నిర్వ‌హించాల‌నుకున్న లంక ప్రీమియ‌ర్ లీగ్ (ఎల్‌పీఎల్‌) వాయిదా ప‌డింది. ఈ మేర‌కు మంగ‌ళవారం లంక క్రికెట్ బోర్డు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. లంక ప్రీమియ‌ర్ లీగ్‌ను న‌వంబ‌ర్‌కు వాయిదా వేస్తున్న‌ట్లు అందులో పేర్కొంది. క‌ర‌నా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ఈ చ‌ర్య తీసుకున్న‌ట్లు బోర్డు ప్ర‌క‌టించింది. ఆట‌గాళ్ల‌కు 14 రోజుల క్వారంటైన్ నిబంధ‌న‌ను కుదించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరినా.. వారు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకుంది.

`ఆట‌గాళ్ల‌కు మూడు రోజుల క్వారంటైన్ విధించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరాం. దానికి ఆరోగ్య శాఖ నుంచి అనుమ‌తి రాలేదు. క‌చ్చితంగా 14 రోజులు ఉండాల్సిందే అని తేల్చి చెప్పింది. ఈ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ నెల లీగ్‌ను ప్రారంభించ‌డం సాధ్యం కాదు అందుకే వాయిదా వేశాం` అని లంక బోర్డు అధికారి తెలిపారు. ఏది ఏమైనా.. యూఏఈ వేదిక‌గా ఐపీఎల్ జ‌రుగుతున్న స‌మ‌యంలో లంక ప్రీమియ‌ర్ లీగ్ ప్రారంభించాల‌నుకోవ‌డం పొర‌పాట‌ని గుర్తించిన బోర్డు.. లీగ్‌ను న‌వంబ‌ర్‌కు వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం. 


logo