బుధవారం 20 జనవరి 2021
Sports - Jan 04, 2021 , 00:02:05

లంక 157.. దక్షిణాఫ్రికా 148/1

లంక 157.. దక్షిణాఫ్రికా 148/1

జొహన్నెస్‌బర్గ్‌: తొలి టెస్టులో శ్రీలంకను చిత్తుచేసిన దక్షిణాఫ్రికా.. రెండో టెస్టులోనూ విజృంభిస్తున్నది. సఫారీ పేసర్లు రెచ్చిపోవడంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌటైంది. కుషాల్‌ పెరెరా (60) మినహా మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. నోర్జే (6/56) నిప్పులు చెరగడంతో ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సఫారీ జట్టు ఆదివారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 148 పరుగులు చేసింది. ఎల్గర్‌ (92 బ్యాటింగ్‌), డసెన్‌ (40 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో 9 వికెట్లు ఉన్న దక్షిణాప్రికా.. ప్రత్యర్థి స్కోరుకు 9 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. 


logo