శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 14, 2020 , 00:33:19

లక్ష్యసేన్‌ శుభారంభం

లక్ష్యసేన్‌ శుభారంభం

  • డెన్మార్క్‌ ఓపెన్‌  

ఒడెన్స్‌: ఏడు నెలల తర్వాత బ్యాడ్మింటన్‌ పునఃప్రారంభాన్ని భారత యువ సంచలనం లక్ష్యసేన్‌ విజయంతో మొదలు పెట్టాడు. మంగళవారం ఇక్కడ జరిగిన డెన్మార్క్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో లక్ష్య 21-9, 21-15 తేడాతో వరుస గేమ్‌ల్లో క్రిస్టో పొపోవ్‌(ఫ్రాన్స్‌)పై అలవోక విజయం సాధించాడు. తొలి గేమ్‌ ఓ దశలో 14-9తో ముందున్న సమయంలో లక్ష్యసేన్‌ వరుసగా ఏడు పాయిం ట్లు సాధించి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వలేదు. 

రెండో గేమ్‌ హోరాహోరీగా సాగి ఓ దశలో 12-12తో సమమైనా వరుస పాయింట్లతో అదరగొట్టి 36 నిమిషాల్లోనే విజయం సాధించాడు. కరోనా ప్రభావం వల్ల ఆటకు సుదీర్ఘ విరామం వచ్చినా కోర్టులోకి అడుగుపెట్టాక అంతా మామూలుగా అనిపించిందని, రిథమ్‌ అందిపుచ్చుకున్నానని మ్యాచ్‌ అనంతరం లక్ష్యసేన్‌ చెప్పాడు.  కాగా శ్రీకాంత్‌, జయరామ్‌ కూడా ఈ టోర్నీ బరిలో ఉండగా.. స్టార్‌ ప్లేయర్లు  సింధు, సైనా దూరం కావడంతో మహిళల సింగిల్స్‌లో భారత్‌ తరఫున పోటీలో ఎవరూ లేరు.