మంగళవారం 07 జూలై 2020
Sports - May 25, 2020 , 00:27:55

సరికొత్త క్రీడాపాలసీకి శ్రీకారం

సరికొత్త క్రీడాపాలసీకి శ్రీకారం

  • సింథటిక్‌ ట్రాక్‌ పనుల శంకుస్థాపనలో క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

వరంగల్‌ స్పోర్ట్స్‌ : రాష్ట్రంలో సరికొత్త క్రీడాపాలసీని అమలులోకి తీసుకురానున్నట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. వరంగల్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం (జేఎన్‌ఎస్‌) ప్రాంగణంలో రూ.7 కోట్లతో ఏర్పాటు చేయనున్న సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ పనులకు ఆదివారం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ‘అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సింథటిక్‌ ట్రాక్‌ని ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని యువ అథ్లెట్లు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రంలో క్రీడారంగానికి పెద్దపీట వేయాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇటీవల సబ్‌కమిటీ వేశాం, ఇందులో క్రీడా విధివిధానాలపై చర్చించి ముఖ్యమంత్రికి వివరిస్తాం, త్వరలోనే రాష్ట్రంలో క్రీడాపాలసీ అమలులోకి వచ్చేలా కృషిచేస్తాం’ అని మంత్రి శ్రీనివాస్‌  గౌడ్‌ అన్నారు.  కార్యక్రమంలో మేయర్‌ గుండా ప్రకాశ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo